దిగొచ్చిన సర్కార్, దీక్షను రద్దు చేసుకున్న బండి సంజయ్

Bandi Sanjay Deeksha : సిరిసిల్ల నేతన్నలకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న బండి సంజయ్ దీక్షకు పిలుపునిచ్చారు. అయితే పాత బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో బండి సంజయ్ నేతన్న దీక్ష విరమించుకున్నారు.

Bandi Sanjay Deeksha : సిరిసిల్లలో నేత కార్మికుల(Sircilla Weavers) సమస్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (MP Bandi Sanjay)ఈనెల 10న చేపట్టే నేతన్న దీక్ష రద్దైంది. నేతన్నలకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు కొత్త ఆర్డర్స్ ఇస్తామని హామీ ఇవ్వడంతో బండి సంజయ్ తన దీక్షను తాత్కాలికంగా విరమించుకున్నట్లు ప్రకటించారు. 6 గ్యారంటీల (Congress 6 Guarantees)పేరుతో ప్రజలను మోసం చేసిన విధంగా ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకు దొంగ హామీలిచ్చి నేతన్నలను మోసం చేయాలనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రభుత్వం హామీని ఎన్నికల కోడ్ మొగిసే లోపే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్నికలు ముగిసిన అనంతరం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే దీక్ష చేపట్టక తప్పదని హెచ్చరించారు.

Loading

Scroll to Top