కేంద్రాన్నిబద్నాం చేసే ప్రయత్నం..

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కేంద్రంలోని మోదీ సర్కారును బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటున్నారని, కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ.లక్షా తొమ్మిది వేల కోట్లు ఉన్నాయని తెలిపారు.

  • రాష్ట్ర బడ్జెట్‌లో 1.09 లక్షల కోట్ల నిధులు కేంద్రానివే.. పైసా ఇవ్వలేదంటూ అసెంబ్లీ తీర్మానమేంటి?: సంజయ్‌
  • నీతి ఆయోగ్‌ సమావేశానికి సీఎం వెళ్లకపోవడం దుర్మార్గమని ఫైర్‌

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. కేంద్రంలోని మోదీ సర్కారును బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటున్నారని, కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ.లక్షా తొమ్మిది వేల కోట్లు ఉన్నాయని తెలిపారు. కేంద్ర పన్నుల్లో వాటా, వివిధ పథకాలకు ఇచ్చే నిధులు, అప్పుల రూపేణా కేంద్రం ఈ మొత్తం ఇస్తుందని పేర్కొన్నారు. అయినా.. తెలంగాణకు కేంద్రం పైసా ఇవ్వలేదంటూ అసెంబ్లీలో తీర్మానం ఎలా చేస్తారని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీల పేరిట ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లో బండి సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని తెలిపారు. విభజన చట్టం హామీలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో మరో మూడు యూనిట్ల కోసం పీపీపీ చేసుకోవాలని కేంద్రం కోరుతున్నా నాటి బీఆర్‌ఎస్‌, నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారుు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రైవేట్‌ సంస్థల నుంచి కరెంట్‌ కొనుగోలు చేయడం సిగ్గుచేటన్నారు.

వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేసినప్పుడు సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ ఎందుకు ప్రతిపాదించలేదన్నారు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు అసాధ్యమని, క్వాలిటీ ఐరన్‌ ఓర్‌ లేదని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలే చెప్పాయని గుర్తు చేశారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకాకపోవడం దుర్మార్గమని బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ కాళేశ్వరం ఆలయ సంప్రదాయాలు పాటించకుండా గర్భగుడిలోకి వెళ్లారని, హిందూ ధర్మాన్ని అవమానించినందుకు ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Loading

Scroll to Top