Author name: bandisanjaybjp.in

Blog

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు బండి సంజయ్ పరామర్శ

Source: దిశ, హుజరాబాద్ రూరల్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని బోర్నపల్లి లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గంట సింధూజ(18), గంట విజయ్ (17), గంట వర్ష (14) కుటుంబాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి తో కలిసి బోర్నపల్లి విచ్చేసిన బండి సంజయ్.. సింధూజ, విజయ్ నివాసాలకు వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ముగ్గురు విద్యార్థులు అతి చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం కుటుంబ సభ్యులకు శోకం మిగిల్చిడం కలిచివేస్తోందని బండి అన్నారు. కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Loading

Blog

దిగొచ్చిన సర్కార్, దీక్షను రద్దు చేసుకున్న బండి సంజయ్

Bandi Sanjay Deeksha : సిరిసిల్ల నేతన్నలకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న బండి సంజయ్ దీక్షకు పిలుపునిచ్చారు. అయితే పాత బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో బండి సంజయ్ నేతన్న దీక్ష విరమించుకున్నారు. Bandi Sanjay Deeksha : సిరిసిల్లలో నేత కార్మికుల(Sircilla Weavers) సమస్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (MP Bandi Sanjay)ఈనెల 10న చేపట్టే నేతన్న దీక్ష రద్దైంది. నేతన్నలకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పాటు కొత్త ఆర్డర్స్ ఇస్తామని హామీ ఇవ్వడంతో బండి సంజయ్ తన దీక్షను తాత్కాలికంగా విరమించుకున్నట్లు ప్రకటించారు. 6 గ్యారంటీల (Congress 6 Guarantees)పేరుతో ప్రజలను మోసం చేసిన విధంగా ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకు దొంగ హామీలిచ్చి నేతన్నలను మోసం చేయాలనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రభుత్వం హామీని ఎన్నికల కోడ్ మొగిసే లోపే అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్నికలు ముగిసిన అనంతరం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే దీక్ష చేపట్టక తప్పదని హెచ్చరించారు.

Loading

Blog

BJP.. కరీంనగర్: బండి సంజయ్ నేడు రైతు దీక్ష

కరీంనగర్: రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ కేంద్రం వద్ద రైతు దీక్ష చేపట్టనున్నారు. రూ. రెండు లక్షల రుణమాఫీ, పంట నష్టం పరిహారం చెల్లింపుపై దీక్ష చేయనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష చేస్తారు. కరీంనగర్: రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ కేంద్రం వద్ద రైతు దీక్ష (Farmer initiation) చేపట్టనున్నారు. రూ. రెండు లక్షల రుణమాఫీ, పంట నష్టం పరిహారం చెల్లింపుపై దీక్ష చేయనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష చేస్తారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt.) ఇప్పటి వరకు పరిహారం అందించలేదని, సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవటం లేదని బండి సంజయ్‌ విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ కేంద్రం వద్ద ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ‘రైతు దీక్ష’ చేపడతామని ప్రకటించారు. వడ్ల కల్లాల వద్ద బస చేసి.. రైతులు పడుతున్న బాధలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు తన దీక్షకు సంఘీభావం తెలపాలని కోరారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు కోసం కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, 2-3 రోజుల్లో ప్రణాళికను వెల్లడిస్తామన్నారు. రైతుల పక్షాన బీజేపీ డిమాండ్లు ఇవే.. తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతోపాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులతో అనుసంధానించాలి. రైతు కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. సమగ్ర పంటల బీమాను అమలు చేసి రైతులతోపాటు రైతు కూలీలు, భూమిలేని రైతులకు సైతం బీమా పథకాన్ని వర్తింపజేయాలి. కొత్త సాగు విధానంతోపాటు పంటల సమగ్ర ప్రణాళికను విడుదల చేయాలి.

Loading

Blog

BJP: 72 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల.. తెలంగాణలో ఆరుగురి పేర్లు.!

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల అయ్యింది. మొత్తం 72 స్థానాల అభ్యర్ధుల జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల అయ్యింది. మొత్తం 72 స్థానాల అభ్యర్ధుల జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. హర్యానా సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌తోపాటు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేరును కూడా ప్రకటించింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో ఆరుగురు పేర్లను ఖరారు చేసింది. మెదక్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్‌ రావు, ఆదిలాబాద్‌ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్‌ పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్‌ నుంచి సీతారాం నాయక్‌ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్‌, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు.

Loading

Scroll to Top