లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల అయ్యింది. మొత్తం 72 స్థానాల అభ్యర్ధుల జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది.
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల అయ్యింది. మొత్తం 72 స్థానాల అభ్యర్ధుల జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. హర్యానా సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్‌తోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును కూడా ప్రకటించింది. తెలంగాణ నుంచి రెండో జాబితాలో ఆరుగురు పేర్లను ఖరారు చేసింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం నగేష్ పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ బరిలోకి దిగుతుండగా.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, నల్గొండ నుంచి సైదిరెడ్డి పోటీ చేయనున్నారు.